Rayapati Sambasiva Rao: టీడీపీకి పవన్‌తో పొత్తు ఉంటే బాగుంటుంది
Rayapati Sambasiva Rao: లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి
Rayapati Sambasiva Rao: టీడీపీకి పవన్‌తో పొత్తు ఉంటే బాగుంటుంది
Rayapati Sambasiva Rao: వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తన కుమారుడు పోటీచేస్తాడని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. చంద్రబాబు టిక్కెట్ ఎక్కడి ఇచ్చినా తన కుమరుడు పోటీకి సిద్ధమని తెలిపారు. టీడీపీకి పవన్‌తో పొత్తు ఉంటే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చంద్రబాబుదే అధికారమని అన్నారు. అప్పట్లో చంద్రబాబు అనుమతిని ఇవ్వడం వల్లే జగన్ పాదయాత్ర చేయగలిగారని గుర్తు చేశారు. లోకేశ్ పాదయాత్రకు కూడా అదేవిధంగా జగన్ అనుమతిని ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ తనకు కూడా మంచి మిత్రుడేనని రాయపాటి తెలిపారు.