TG Bharath: తప్పు చేశారు కాబట్టే జగన్ డిఫెన్స్‌లో పడ్డారు.. తిరుమల వివాదంపై మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు..
TG Bharath: సిట్ దర్యాప్తులో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని... ఎక్కడ చెప్పలేదని మంత్రి టీజీ భరత్ అన్నారు.
TG Bharath: సిట్ దర్యాప్తులో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని... ఎక్కడ చెప్పలేదని మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. ఇది నిజమని హాట్ కామెంట్స్ చేశారు. కర్నూలు నగరంలోని 52వ వార్డులోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఇంటింటికి వెళ్లి మంత్రి టీజీ భరత్ పెన్షన్ పంపిణీ చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి ఇప్పుడు మళ్ళీ అడ్డంగా వాదిస్తున్నారన్నారు. కల్తీ జరిగింది కాబట్టే మాజీ సీఎం జగన్ డిఫెన్స్‌లో పడ్డారని.. జగన్ తిరుమల వెళ్లి వెంకన్న స్వామికి క్షమాపణలు చెప్పాలని కొరారు.