APTRANSCO Alert: జాగ్రత్త.. విద్యుత్ లైన్ల కింద చెత్త కాల్చితే కటకటాల్లోకే!

APTRANSCO Alert: శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ లైన్ల కింద మంటలు పెట్టే వారిపై కఠిన చర్యలు. ప్రాణ హానితో పాటు విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగించే చర్యలపై ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఏ. వెంకటరమణ హెచ్చరిక.

Update: 2026-03-18 14:26 GMT

APTRANSCO Alert: జాగ్రత్త.. విద్యుత్ లైన్ల కింద చెత్త కాల్చితే కటకటాల్లోకే!

శ్రీకాకుళం/పలాస: శ్రీకాకుళం జిల్లాలో ఎక్స్ట్రా హైటెన్షన్ (220 KV, 132 KV) మరియు హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద మంటలు పెట్టడంపై విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అజాగ్రత్తగా మంటలు పెట్టడం వల్ల ప్రాణాపాయంతో పాటు భారీ ఆస్తి నష్టం సంభవిస్తోందని ఏపీ ట్రాన్స్‌కో సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) ఏ. వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.

సరఫరాకు విఘాతం - ప్రాణాలకు ముప్పు:

వ్యవసాయ పొలాల్లో చెత్తను కాల్చడం లేదా పోరంబోకు స్థలాల్లోని పొదలకు నిప్పు పెట్టడం వల్ల విద్యుత్ లైన్లకు అంతరాయం కలుగుతోంది. దీనివల్ల గ్రామాలకు, మండలాలకు, పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. పునరుద్ధరణకు ఎక్కువ సమయం పడుతుండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంది. APTRANSCO సంస్థకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.

చట్టపరమైన చర్యలు తప్పవు:

విద్యుత్ చట్టం (AP Electricity Act 1910 /1956 / 2003) ప్రకారం విద్యుత్ లైన్ల కింద లేదా ప్రక్కన మంటలు పెట్టడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తామని ఎస్ఈ హెచ్చరించారు.

అత్యవసర నంబర్లు:

ఎవరైనా లైన్ల కింద మంటలను గమనించినట్లయితే వెంటనే ఈ క్రింది నంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరారు:

📞 9979765763, 9440801372, 8247816102

అధికారుల విజ్ఞప్తి:

"ఈ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా మనందరికీ అవసరం. మంటలను నివారిద్దాం.. విద్యుత్ సంస్థలను కాపాడుకుందాం" అని ఏ. వెంకటరమణ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News