Palasa: ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం! ఎమ్మెల్యే ఆదేశాలతో లొడగల ఆకస్మిక తనిఖీ
Palasa: పలాసలో అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు.
Palasa: ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం! ఎమ్మెల్యే ఆదేశాలతో లొడగల ఆకస్మిక తనిఖీ
పలాస, శ్రీకాకుళం జిల్లా: "పేదవాడి ఆకలి కేక వినకూడదు" అనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మహోన్నత ఆశయానికి, "ప్రతి పేదవాడి కడుపు నింపాలి" అనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి ప్రతిరూపం అన్నా క్యాంటీన్లు అని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లోడగల కామేశ్వరరావు గారు కొనియాడారు. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచిందని ఆయన అన్నారు.
పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారి ఆదేశాల మేరకు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్నా క్యాంటీన్‌ను ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్ నిర్వహణను, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. వంటశాలను, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం, అక్కడ భోజనం చేస్తున్న పేదలతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. "కేవలం 5 రూపాయలకే ఇంత మంచి భోజనం దొరకడం మా అదృష్టం సార్. ఇక్కడ అన్నం చాలా రుచిగా, శుభ్రంగా ఉంటుంది" అని వారు ఆనందం వ్యక్తం చేయగా, కామేశ్వరరావు గారు భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం శ్రీ కామేశ్వరరావు గారు మాట్లాడుతూ, "ఎమ్మెల్యే గౌతు శిరీష గారి ఆదేశాలతో ఈ రోజు ఇక్కడికి వచ్చాను. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసివేసిన ఈ క్యాంటీన్లను, మా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి పేదలకు అండగా నిలిచింది. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం. కేవలం 5 రూపాయలకే ఇంత శుభ్రమైన, రుచికరమైన భోజనం అందించడం మా ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాం," అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 27వ వార్డు మాజీ కౌన్సిలర్ గురుటి సూర్యనారాయణ రావు గారు, క్లస్టర్ ఇన్‌చార్జ్ సవర రాంబాబు గారు, లేబర్ యూనియన్ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి గారు, బద్రి గోపాల్ రావు గారు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.