తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

Update: 2019-02-27 02:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం మంగళవారమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో మార్చి 16 వరకు ప్రథమ సంవత్సరం, మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగుస్తుంది. మొత్తం 10 లక్షల 64 వేల మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ఒక వేయి 448 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇక తెలంగాణాలో మొత్తం 9 లక్షల 42లకుపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌ ఇంటర్‌ విద్యార్థులు 4 లక్షల 52 వేల 550 మంది ఉన్నారు. 4 లక్షల 90 వేలు మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. వెయ్యి 277 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచిస్తోంది ఇంటర్ బోర్డు. 

Similar News