ఆకట్టుకుంటున్న సంక్రాంతి ఆర్ట్.. పండగ విశిష్టతను తెలిపే విధంగా చిత్రం

Sankranti: ఆకట్టుకుంటున్న సంక్రాంతి ఆర్ట్.. పండగ విశిష్టతను తెలిపే విధంగా చిత్రం

Update: 2024-01-14 08:00 GMT

ఆకట్టుకుంటున్న సంక్రాంతి ఆర్ట్.. పండగ విశిష్టతను తెలిపే విధంగా చిత్రం

Sankranti: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో సంక్రాంతి పండగ సందర్భంగా.. మలికిపురం గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ పూర్తిగా వ్యవసాయ పండుగ, రైతుల పండుగగా తెలిపే విధంగా అద్భుతంగా చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతి నాటికి రైతులు పండించిన నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయన్నారు. దీనికి కృతజ్ఞతగా ఆనందంతో రైతులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారన్నారు. ఈ విన్యాసాలు అన్నీ జతపరుస్తు అద్భుతమైన కళాఖండాన్ని ఎన్. సంగీత్ చిత్రీకరించారు. సునయన ఆర్ట్స్ అకాడమీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News