Anil Kumar Yadav: నేనెప్పుడూ రెడ్డి సామాజికవర్గానికి వ్యతిరేకం కాదు
Anil Kumar Yadav: ఎక్కడికెళ్లినా.. నేను రెడ్డీల వ్యతిరేకినని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు
Anil Kumar Yadav: నేనెప్పుడూ రెడ్డి సామాజికవర్గానికి వ్యతిరేకం కాదు
Anil Kumar Yadav: రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేకి అని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి అనిల్ స్పందించారు. తాను ఎప్పుడూ రెడ్డిలకు వ్యతిరేకం కాదని.. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 14 ఏళ్ల తన రాజకీయం జీవితంలో.. తనతోపాటు నడిచిన వారిలో 70 శాతం రెడ్డీలే ఉన్నారని గుర్తుచేశారు. తన స్నేహితుల్లోనూ రెడ్డీలే అధికంగా ఉన్నారని వెల్లడించారు. తాను ఎప్పుడూ ఎవరితోనూ వ్యతిరేకం అని చెప్పలేదని.. అయినా.. కొందరు పనిగట్టుకుని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.