Anakapalle: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కిన భారీ చేప
Anakapalle: మత్స్యకారుల వలకు చిక్కిన ముక్కుడు టేకు చేప
Anakapalle: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కిన భారీ చేప
Anakapalle: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ ముక్కుడు టేకు చేప వలకు చిక్కింది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సముద్రంలో వేటకు వెళ్లిన కారే దుబెన్ బృందం వేసిన వలకు సుమారు 1500 కేజీల బరువైన భారీ చేప చిక్కింది. ఇది అరుదైన జాతికి చెందిన ముక్కుడు టేకు చేప అని.. ఔషధ తయారీలో మాత్రమే ఉపయోగిస్తారని తెలిపారు. ఈ భారీ చేప విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. భారీ చేపను ఒడ్డుకు తీసుకురావడానికి చాలా శ్రమించామంటున్నారు మత్స్యకారులు. భారీ ముక్కుడు టేకు చేపను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.