Road Accident: మృత్యవు ముందు ఓడిపోయిన ప్రేమ జంట
Road Accident: ప్రేమ జంటను మృత్యువు కదిలించింది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యువును జయించలేకపోయింది.
Road Accident: మృత్యవు ముందు ఓడిపోయిన ప్రేమ జంట
Road Accident: ప్రేమ జంటను మృత్యువు కదిలించింది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట మృత్యువును జయించలేకపోయింది. మృత్యుముందు ప్రేమ ఓడిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో చోటుచేసుకుంది.. ఏడాది క్రితం ప్రేమ వివాహంతో ఒక్కటైన జంటకు మూడు నెలల పాప ఉంది. ఆధార్ అప్డేట్ కోసం రాజానగరానికి భార్యభర్తలు స్కూటీపై వెళ్తున్నారు. అప్పుడే సిమెంట్ లోడుతో వెళ్తోన్న లారీ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ప్రమాదంలో భార్యాభర్తలు ప్రసాద్, సోనియా అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో నందరాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.