Anantapur: గిట్టుబాటు ధర లేక అరటి రైతు ఆత్మహత్య
Anantapur: అప్పుల బాధతో అరటి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని వెల్లుట్లలో చోటుచేసుకుంది.
Anantapur: అప్పుల బాధతో అరటి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని వెల్లుట్లలో చోటుచేసుకుంది. ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం తన మూడు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశారు. దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేశారు. పంట కోత సమయంలో మార్కెట్లో ధరలు పడిపోయాయి. పంటను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనకు గురైన నాగలింగం.. తోట వద్దకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. తోటలో తనతోపాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు నార్పల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.