CM Chandrababu: విద్యార్థుల దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది
CM Chandrababu: వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: విద్యార్థుల దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది
CM Chandrababu: వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆట, పాటలు ఉండాలని తెలిపారు. విద్యార్థులు ఆడుతూపాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందని.. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందని తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకొస్తామని చెప్పారు.