Tirumala: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. శిలాతోరణం వద్ద డ్రోన్‌ను ఎగర వేసిన ఓ భక్తుడు
Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి డ్రోన్ కెమెరా కలకలం రేపింది.
Tirumala: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. శిలాతోరణం వద్ద డ్రోన్‌ను ఎగర వేసిన ఓ భక్తుడు
Tirumala: తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి డ్రోన్ కెమెరా కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ను ఎగురవేయడం ద్వారా మరోసారి భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం శిలాతోరణం సమీపంలో చోటుచేసుకుంది. ఒక భక్తుడు డ్రోన్ కెమెరాను ఎగురవేయడాన్ని అక్కడ విధుల్లో ఉన్న టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, దానిని ఎగురవేసిన భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల క్షేత్రం అత్యంత సున్నితమైన మరియు రక్షణ ప్రాధాన్యత ఉన్న ప్రాంతం కాబట్టి, ఇక్కడ డ్రోన్‌లను, ఇతర వైమానిక వస్తువులను ఎగురవేయడంపై నిషేధం ఉంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ భక్తుడు డ్రోన్‌ను ఉపయోగించడంపై విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భద్రత విషయంలో నిరంతర నిఘా ఉన్నప్పటికీ డ్రోన్ దర్శనమివ్వడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా టీటీడీ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.