Earthquake: ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు
Earthquake: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణంలో శుక్రవారం ఉదయం భూమి కంపించడంతో స్థానికంగా తీవ్ర కలవరం నెలకొంది.
Earthquake: ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు
Earthquake: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణంలో శుక్రవారం ఉదయం భూమి కంపించడంతో స్థానికంగా తీవ్ర కలవరం నెలకొంది. ఈ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు ధృవీకరించారు.
పొదిలి పట్టణంలోని ఇస్లాంపేట, శ్రావణి ఎస్టేట్, బెస్తపాలెం వంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు స్పష్టంగా అనుభవమయ్యాయి. ఈ ప్రకంపనలు సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతగా నమోదైంది. తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికీ, కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూమి కంపించగానే ప్రజలు అప్రమత్తమై, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ఇళ్లలో నుంచి బయటకు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో గుమిగూడి ఉండిపోయారు. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితిని అంచనా వేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.