ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభం

ఏపీలో మరో వినూత్న కార్యక్రమం ప్రారంభం అయింది. ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి రక్షణ,

Update: 2019-10-17 10:55 GMT

ఏపీలో మరో వినూత్న కార్యక్రమం ప్రారంభం అయింది. ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కిశోర పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథకాన్ని గురువారం హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సుచరిత మాట్లాడుతూ.. మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఏపీలో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇచ్చిన ఘనత జగన్ దేనని అన్నారు.

మరో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. 'కీలకమైన బాల్యంలో తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలని, అదేవిధంగా యవ్వనంలో తల్లిదండ్రులను మోసం చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి' అని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి , ముస్తఫా పాల్గొన్నారు.  

Tags:    

Similar News