ఇవాళ సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ సమావేశం

Update: 2020-01-17 03:16 GMT

రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇవాళ హైపవర్ కమిటీ ముఖ‌్యంమంత్రి జగన్ తో సమావేశం కానుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరగనుంది. కాగా..ఇదే హైవప్ కమిటీ చివరి సమావేశం కావడంతో రాజధాని అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధానిపై హైపవర్ కమిటీ సీఎంతో సమావేశంమై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనుంది.

విశాఖలోనే సచివాలయం ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు ఏలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశంపై చర్చలు జరుగుతాయని సమాచారం.సచివాలయం తరలింపు ప్రక్రియ ఏప్పుడు ప్రారంభించాలి అనే అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. జనవరి 20న కేబినెట్‌లో హైపవర్ కమిటీ రిపోర్ట్ పై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఇస్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను హైపవర్‌ కమిటీ పరిశీలించింది.  

Tags:    

Similar News