విజయవాడలో హైటెన్షన్.. రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Update: 2020-01-08 14:49 GMT
chandrababu

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదిక కల్యాణ మండపం ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్రగా బయల్దేరగా బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్టాడిన చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరని అన్నారు. సీపీఐ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. అరెస్టులతో తమను ఆపలేరన్నారు. చంద్రబాబుతో సహా పలువురు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరుపతున్నారు.

Tags:    

Similar News