Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తిశాఖ ఉన్నతస్థాయి సమావేశం
Polavaram Project: జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో భేటీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తిశాఖ ఉన్నతస్థాయి సమావేశం
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఢిల్లీలో ఏపీ అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయం శ్రమ శక్తి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ ECRF ఆనకట్ట డయాఫ్రమ్ వాల్ పరిస్థితి, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పరిస్థితిపై సమీక్ష, కాఫర్ డ్యామ్ నష్ట నివారణ చర్యలపై కార్యాచరణ రూపొందిస్తారు.
అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నుంచి లీకేజీని పరిగణనలోకి తీసుకుని ECRF డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు సవరించిన వ్యయ అంచనాను ఖరారు చేయడం, సహా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై ఈ సమావేశంలో కార్యచరణ రూపొందిస్తారు.