వాయవ్య భారత్ నుంచి ఉపసంహరించుకుంటున్న రుతుపవనాలు.. దీని ప్రభావం..

వాయవ్య భారత్ నుంచి ఉపసంహరించుకుంటున్న రుతుపవనాలు.. దీని ప్రభావం..

Update: 2019-10-09 02:05 GMT

రుతుపవనాలు వాయవ్య భారత దేశం నుంచి ఉపసంహరణ మొదలుపెట్టాయి.. దీనికి అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. దీంతో ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగాల 48 గంటల్లో ఉత్తర కోస్తా, యానాం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 

Tags:    

Similar News