రాజ్‌‌భవన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అవకతవకలపై గవర్నర్ సీరియస్

-ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటీ నివేదిక -ఏడుగురు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన పోలీసులు

Update: 2019-11-10 10:43 GMT
Biswa bhushan Harichandan

ఏపీ రాజ్‌ భవన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో అవకతవకలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సీరియస్ అయ్యారు. రాజ్‌ భవన్‌లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ సుమతి ఏజెన్సీ సర్వీసెస్ డబ్బులు డిమాండ్ చేసింది. విషయం గవర్నర్‌ దృష్టికి వెళ్లడంతో కార్యదర్శితో గవర్నర్ కమిటీ చేశారు. ఉద్యోగాల పేరిట వసూళ్లు నిజమేనని కమిటి నివేదిక ఇవ్వడంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని విజయవాడ సీపీని గవర్నర్ ఆదేశించారు. అక్రమ దందాకు తెరలేపిన సుమతి సంస్థ మేనేజర్ ముని శంకర్‌పై కేసు నమోదు చేశారు.

మరోవైపు రాజ్‌ భవన్‌ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డ ఏడుగురు నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జడ్జి నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నిందితులను విజయవాడ్ సబ్ జైలుకు తరలించారు. 

Tags:    

Similar News