ఏపీఎస్‌ ఆర్టీసీ విలీన చట్టానికి గవర్నర్ ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులు విలీన చట్టానికి గవర్నర్ ఆమోదం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న ప్రభుత్వం

Update: 2019-12-27 15:06 GMT
APSRTC

ఏపీలో ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. శాసనసభలో ఆమోదం పొందిన ఏపీ ఆర్టీసీ చట్టం 2019 ప్రకారం ఉద్యోగుల విలీనానికి అంగీకారం తెలిపారు. విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది. ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారనుంది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.  

Tags:    

Similar News