Tadipatri: చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి

తాడిపత్రికి చెందిన చేనేత కార్మికులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిందిగా స్థానిక ఎమ్మార్వోకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

Update: 2020-02-17 11:16 GMT

తాడిపత్రి: తాడిపత్రికి చెందిన చేనేత కార్మికులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిందిగా స్థానిక ఎమ్మార్వోకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రతినెలా వెయ్యి రూపాయలు పట్టు సబ్సిడీని అందజేయాలని, మరమగ్గాల తో చేనేత కార్మికులు పోటీపడలేక, దళారుల పై ఆధారపడి జీవించాలి చూస్తోందని, ప్రభుత్వం చేనేత కార్మికులకు సంబంధించి వివిధ రకాలైన పథకాలను పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని వారు కోరారు.

దిన, దినానికి పెరిగిపోతున్న ముడిసరుకుధరలు, నిత్యావసర వస్తువుల ధరలుతో పోటీపడి కుటుంబాన్ని నెట్టుకు రావడం చాలా ఇబ్బందికరంగా తయారైందని వారి వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి నియాజ్ అహ్మద్ చేనేత కార్మికులు వినతిపత్రం అందజేశారు.

Tags:    

Similar News