కీలక పథకాన్ని ప్రారంభించిన జగన్.. ఆ పరిశ్రమలకు ఊరట..

కీలక పథకాన్ని ప్రారంభించిన జగన్.. ఆ పరిశ్రమలకు ఊరట.. కీలక పథకాన్ని ప్రారంభించిన జగన్.. ఆ పరిశ్రమలకు ఊరట..

Update: 2019-10-17 03:59 GMT

సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'వైఎస్సార్‌ నవోదయం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పధకంలో భాగంగా సుమారు 80,000 యూనిట్లుకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టేట్ లెవెల్ బ్యాంకర్లు కమిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80,000 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రూ.4,000 కోట్ల వరకు రుణాలను బకాయిపడ్డాయి.

రుణాలు తీర్చలేని యూనిట్లు కొన్ని మూతపడే స్థితికి వచ్చాయి. దాంతో ఈ యూనిట్లను వైఎస్సార్‌ నవోదయం పథకంలో చేర్చారు. మొండి బకాయిలుగా మారడానికి సిద్ధంగా ఉన్న ఖాతాలకు వన్‌టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌ కింద యూనిట్ ఖాతాను పునరుద్ధరించుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News