Chebrolu: గేట్–2020లో విజ్ఞాన్స్ విద్యార్థికి 330 ర్యాంకు
వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన గొప్పరాజు హరీష్‌బాబు అనే విద్యార్థి జాతీయస్థాయి గేట్–2020లో 330 ర్యాంకును సాధించి ప్రతిభను కనపరచినట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ సోమవారం తెలిపారు.
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన గొప్పరాజు హరీష్‌బాబు అనే విద్యార్థి జాతీయస్థాయి గేట్–2020లో 330 ర్యాంకును సాధించి ప్రతిభను కనపరచినట్లు విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి యూని వర్సిటీలో అభినందన సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వీసీ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన గొప్పరాజు హరీష్‌బాబు గేట్–2020 పరీక్షలో 63 శాతం మార్కులతో (గేట్ స్కోర్–766) జాతీయ స్థాయిలో 330 ర్యాంకును సాధించినట్లు వెల్లడించారు.
గేట్–2020లో ఉత్తీర్ణత సాధించడానికి మేము అవలంబిస్తున్న ప్రత్యేక తరగతులు, ట్రైనింగ్ క్లాస్‌లు, కౌన్సిలింగ్ సిస్టం విధానాలే కారణమని పేర్కొన్నారు. విద్యార్థు లను బలవంతంగా, బాధతో చదివించడం కాకుండా విద్యార్థులే స్వతహాగా చదువుకునే విధంగా ప్రోత్సాహించటం, ఆలోచన కలిగించటం, జీవితంలో ఉన్న తంగా స్థిరపడాలనే అభిరుచిని కలగజేస్తామన్నారు. ఈ సందర్భంగా గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన గొప్పరాజు హరీష్‌బాబు మాట్లాడుతూ ప్రముఖ ఐఐటీ కాలేజీలో ఎంటెక్ కోర్సును పూర్తి చేసి పరిశోధనలు చేయడమే లక్ష్యమని తెలిపారు.