పెన్సిల్‌పై 2020ను అద్భుతంగా మలిచిన తెలుగు కుర్రాడు

మైక్రో ఆర్ట్స్‌తో టాలెంట్ చూయిస్తూ అదుర్స్ అనిపిస్తున్నాడు విశాఖ కుర్రాడు.

Update: 2019-12-31 12:13 GMT
venkatesh

  మైక్రో ఆర్ట్స్‌తో టాలెంట్ చూయిస్తూ అదుర్స్ అనిపిస్తున్నాడు విశాఖ కుర్రాడు. సూక్ష్మ్ కళతో క‌ళాఖండాల‌ను రూపొందిస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా పెన్సిల్ పై 2020 న్యూ ఇయర్ ను అదర్భుతంగా రూపొందించాడు. 2 సెం.మీ ఎత్తు, 3 మి.మీ వెడల్పుతో రెండు గంటల సమయంలో పెన్సిల్ పై 2020 చక్కగా మలిచాడు.

విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ గీతం యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభ్యాసిస్తున్నాడు. బాల్యం నుంచి సూక్ష్మ కళలో ఆసక్తి పెంచుకున్నారు. పెన్సిల్‌, అగ్గిపుల్ల, పేపర్, ఐస్ క్రీమ్ స్టిక్, సబ్బు ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుపై తన టాలెంట్ ఆవిష్కరిస్తారు. ఇప్పటి వరకూ ఏకంగా నాలుగు వందల కళాకృతులను తీర్చిదిద్దాడు. గిన్నిస్ రికార్డులతోపాటు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కైవసం చేసుకున్నాడు. విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మైక్రో ఆర్ట్స్ కళలో శిక్షణ ఇస్తున్నాడు.

వెంకటేష్ విభిన్నమైన మైక్రో ఆర్ట్స్‌తో తయారు చెస్తున్న ఆర్ట్స్ చూప‌రుల‌ను ఇట్టే కట్టి ప‌డేస్తున్నాయి. ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పంటిపుల్లపై ఆరేళ్లపాటు శ్రమించి దాన్ని చెక్కాలని పట్టుదలతో దాన్ని మలచాడు. 19 ఏళ్లకే గిన్నిస్ రికార్డుల ఎక్కాడు. వెంకటేష్ స్వయంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సైతం తన కళాకాండాలను చూపించారు. అందుకే, విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పాఠశాల విద్యార్థులకు ఆయన సూక్ష్మ కళలో శిక్షణ ఇస్తున్నారు. తన లాంటి ప్రతిభావంతులను తయారుచేస్తానని చెబుతున్నాడు.


Tags:    

Similar News