శ్రీసత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం.. నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ దారుణ హత్య

శ్రీసత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను మేనమామ ప్రసాదే హత్య చేసిన ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-11-27 06:47 GMT

శ్రీసత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం.. నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ దారుణ హత్య

శ్రీసత్యసాయి జిల్లా గరికపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను మేనమామ ప్రసాదే హత్య చేసిన ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం మేనమామ ప్రసాద్‌ ఇంటిదగ్గర ఆడుకుంటున్న బాలుడు హర్షవర్ధన్‌.. ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మేనమామా ప్రసాద్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో.. మేనమామ ప్రసాద్‌ను పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపడింది. తానే హర్షవర్ధన్‌ హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు మేనమామ ప్రసాద్. జౌకుల అటవీప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బంధువులే తమ కుమారుడిని హత్య చేయడంతో గుండెలు పగిలేలా తల్లడిల్లిపోతున్నారు బాలుడి తల్లిదండ్రులు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మేనమామ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News