ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి
Lododdi Village: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.
ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి
Lododdi Village: తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. రంపచోడవరం మండలం లొదుడ్డిలో జీలుగ కల్లు తాగి గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. జీలుగ కల్లులో విషం కలిసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.