చేతివాటం ప్రదర్శించిన గ్రామ వాలంటీర్లు.. ఊడిన ఉద్యోగం

చేతివాటం ప్రదర్శించిన గ్రామ వాలంటీర్లు.. ఊడిన ఉద్యోగం చేతివాటం ప్రదర్శించిన గ్రామ వాలంటీర్లు.. ఊడిన ఉద్యోగం

Update: 2019-10-04 10:33 GMT

నలుగురు గ్రామ వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించడంతో వారిని వాలంటీర్ ఉద్యోగం నుంచి తొలగించారు అధికారులు. ఈ ఘటన కృష్ణా జిల్లా రుద్రవరంలోజరిగింది. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుంచి రూ.50/-లు దసరా మాముళ్ళ కింద వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదు అందింది. దాంతో అధికారులు విచారణకు ఆదేశించగా వసూళ్ళకు పాల్పడినట్టు నిజనిర్ధారణ అయింది.

దీంతో గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కార్యదర్శి నివేదిక, GO.NO.104, గ్రామ వాలంటీర్ల నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వారి స్థానంలో వేరే వాళ్ళను నియమించేందుకు అధికారులు పని ప్రారంభించారు. 

Tags:    

Similar News