Annamayya District: గృహప్రవేశ వేడుకలో విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి
Current Shock: అన్నమయ్య జిల్లా కానుగమాకులపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
Annamayya District: గృహప్రవేశ వేడుకలో విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి
Current Shock: అన్నమయ్య జిల్లా కానుగమాకులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ గృహప్రవేశ కార్యక్రమంలో కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.