Prathipati Pullarao Son Arrest: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్ట్

Guntur: పన్ను ఎగవేత కేసులో పత్తిపాటి కుమారుడు శరత్‌ అరెస్ట్

Update: 2024-02-29 10:02 GMT

Prathipati Pullarao Son Arrest: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్ట్

Prathipati Pullarao Son Arrest: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారని శరత్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల ఫిర్యాదుతో.. విజయవాడలోని మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. శరత్‌తో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 420, 409, 467,471, 477(A), 120 B రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. FIRలో పుల్లారావు భార్య, బావమరిదితో పాటు ఐదుగురి పేర్లు మెన్షన్‌ చేశారు పోలీసులు. అలెక్సా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పన్ను ఎగవేశారని FIRలో నమోదు చేశారు. విజయవాడ టాస్క్‌‌ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శరత్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు పోలీసులు.

Tags:    

Similar News