మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

Update: 2019-09-29 12:48 GMT

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తేతలి రామారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి1989, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 లో మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అమాత్య పదవి దక్కలేదు. రామారెడ్డి మృతి పట్ల అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లిమిల్లి శేషారెడ్డి, రామకృష్ణారెడ్డి అలాగే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags:    

Similar News