Pendurthi: రామునాయుడు ఆధ్వర్యంలో పేదలకు భోజన పొట్లాలు పంపిణీ

Update: 2020-04-25 06:59 GMT

పెందుర్తి: జీవీఎంసీ 96వ వార్డు బీజేపీ, జనసేన పార్టీల కార్పొరేటర్ అభ్యర్థి గొర్లి రామునాయుడు ఆర్థిక సాయంతో ఆ వార్డు పరిధిలోని యాతపేట, పెందుర్తి పాత ఊరు, నూకాలమ్మ ఆలయం వద్ద, మర్రిచెట్ల కాలనీ, చాకలిపేట ఇతర ప్రాంతాల్లో నిరుపేదలు, రోజు కూలీలకు భోజన పొట్లాలను అందజేశారు.

ఈ సందర్భంగా రాము నాయుడు మాట్లాడుతూ... లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న వర్గాల ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 27 రోజుల నుండి ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. తాను నిరుపేదలకు, అభాగ్యులకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రామానాయుడు తెలిపారు.


Tags:    

Similar News