హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
*వరద ప్రవాహంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి.. రాకపోకలు నిలిపివేసిన పోలీస్ యంత్రాంగం
హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర 65వ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వాహనాలన్నీ హైవేపే నిలిచిపోవాల్సి వచ్చింది. వరద ప్రవాహం అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.