AP: ఇంటర్ మొదటి ఏడాది పబ్లిక్ ఎగ్జామ్స్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాదినుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈనెల 26వ తేదీ వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యాథతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదవుపై ఫోకస్ పెట్టరని..అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని ఇలాంటి సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్ సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉన్న విధానంలోనే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. గణితంలో ఏ, బీ పేపర్స్ ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్ గా ఇస్తారు. జంతు, వ్రుక్ష జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్చికంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వీటిపై త్వరలోనే ఇంటర్ విద్య మండలి సమావేశం నిర్వహించాలని తీర్మానాలు చేయనున్నారు.