AP SSC Exams: విద్యార్థులకు అలర్ట్..మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

AP SSC Exams: విద్యార్థులకు అలర్ట్..మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు
x
Highlights

AP SSC Exams: ఏపీలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా...

AP SSC Exams: ఏపీలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్షలకు 6,19,275మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పదవ తరగతి పరీక్ష రోజు పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్నలు అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. ఫేక్ న్యూస్, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల స్థాయిలో జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, విద్య తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories