తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. ప్రమాదంలో 15 లక్షలమేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. షాపులో పనిచేసే సిబ్బంది బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్టుసర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.