Eye Flu: వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కండ్ల కలక కేసులు..

Eye Flu: స్కూల్ పిల్లల్లోనే ఎక్కువగా నమోదవుతున్న కేసులు:

Update: 2023-07-31 06:22 GMT

Eye Flu: వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కండ్ల కలక కేసులు..

Eye Flu: ఏపీలో కళ్ల కలక కలవరపెడుతోంది. విశాఖపట్నం, అకనాపల్లి, శ్రీకాకుళం, ఎన్నీఆర్‌, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో కళ్ళ కలకల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో కేసులు ఎక్కువయ్యాయి. మలేరియా, డెంగ్యూ, ఫ్లూతో పాటు కండ్ల కలక కేసులు పెరుగుతుంటాయి. పాఠశాలల్లో చిన్నారుల నుంచి కళ్ళ కలక వ్యాప్తి ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో విద్యార్థులు కళ్ళకలక భారిన పడుతున్నారు.

పెద్దా చిన్ని తేడా లేకుండా అందరూ కళ్ళ కలకల భారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నేత్ర విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐడ్రాప్స్‌ సులువుగా తగ్గిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మెడికల్‌ షాపుల్లో కళ్ళ కలక మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. బలమైన గాలులు తోడవ్వడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గాల్లో తేమశాతం పెరిగింది. ఈ మార్పుల కారణంగా వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తోంది.

కళ్ళ కలక చిన్న ఇన్‌ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ పని చేసుకోనీయకుండా ఇబ్బందిపెడుతోంది. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడం వల్ల వ్యాప్తి చెందుతోంది. మందులు వాడకపోయినప్పటికీ వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉందని, కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్‌ డ్రాప్స్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.  

తెలంగాణలో కళ్లకలక కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో హైదారాబాద్‌లో 95 కళ్లకలక కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రజలు కళ్లకలక బారిన పడుతున్నారు. కళ్లు ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెబుతున్నారు. కళ్ల కలకను ఏవిధంగా వస్తుంది..? 

Tags:    

Similar News