పోలీసులకు బ్రీత్ అనలైజర్లు అందించిన హోమ్ మంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రస్థాయి రోడ్డు భద్రతలో భాగంగా తిరుపతి జిల్లాలో రోడ్డు భద్రత - మా ప్రాధాన్యత కార్యక్రమం నిర్వహించారు.

Update: 2025-12-23 10:13 GMT

రాష్ట్రస్థాయి రోడ్డు భద్రతలో భాగంగా తిరుపతి జిల్లాలో రోడ్డు భద్రత - మా ప్రాధాన్యత కార్యక్రమం నిర్వహించారు. హోమ్ మంత్రి వంగ‌ల‌పూడి అనిత పోలీసులకు అత్యాధునిక బ్రీత్ అనలైజర్లు అందించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News