CM Chandrababu: ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నట్లు అధికారుల సమాచారం.
CM Chandrababu: ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నట్లు అధికారుల సమాచారం. అక్కడ రామజన్మభూమిని చంద్రబాబు సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లి తిరిగి సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
అలగే ఈ నెల 26న తిరుపతిలో పర్యటించనున్నారు. ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం' కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.