శనివారం లోపు రాజధానిపై కీలక భేటీ!

శనివారం లోపు రాజధానిపై కీలక భేటీ! శనివారం లోపు రాజధానిపై కీలక భేటీ!

Update: 2019-10-17 02:14 GMT

అమరావతి రాజధానిలో భారీగా అవకతవకలు జరిగాయన్న అనుమానంతో వైసీపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రెండున్నర నెలల పాటు క్షేత్ర స్థాయిలో పనులను అంచనా వేసిన కమిటీ సభ్యులు సమగ్ర నివేదికను రూపొందించారు. అలాగే రాజధానిలో భూముల కొనుగోలు వ్యవహారంపైనా ఈ కమిటీ వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారీ నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. వివిధ అంశాలపై అధ్యయనం చేసిన.. ఈ కమిటీ..

ఈ శనివారం లోపు దీనిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన ఎఫ్‌సీఎస్‌ పీటర్, పొన్నాడ సూర్యప్రకాష్, అబ్దుల్‌ బషీర్, ఎల్‌.నారాయణరెడ్డి, ఐఎస్‌ఎన్‌ రాజు, ఆదిశేషు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ కొన్ని కీలక అంశాలపై దర్యాప్తు చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, భూ సమీకరణ పేరుతో సేకరించిన భూములను రెండు నెలలపాటు పరిశీలించి మొత్తగా ఈ వారంలో సీఎంను కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

Tags:    

Similar News