ఎక్సైజ్ కానిస్టేబుల్ @ అక్రమాల పుట్ట

Update: 2020-09-30 06:30 GMT

అతనొక మాములు ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ అనుహ్యంగా కోట్లకు పడగలెత్తాడు. 20 ఏళ్లలో 20 కోట్లు సంపాదించాడు. అయితే ఇదంతా అక్రమ సొమ్మే లంచం తీసుకోవడం ఆయన వ్యసనం. మోసం చేయడం అతనికి వెన్నెతో పుట్టిన విద్య. చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ అతడొక మాయకుడు. మనిషికి ఏ లక్షణాలుండకూడదో అవన్నీ ఇతనిలో పుష్కలంగా కనిపిస్తాయి. సకల నేర కళా వల్లభుడైన ఆ కానిస్టేబుల్ బాగోతం ఎంటో ఇప్పుడు చుద్దాం.

సీకేబీ నరసింహారెడ్డి ఇతనొక మాములు కానిస్టేబుల్ కానీ మహా కోటిశ్వరుడయ్యాడు. లంచాలు, కబ్జాలు, అక్రమ వ్యాపారాలు ఆయన ఆదాయ మార్గాలు. ఊరూరా బారులు నెలకొల్పాడు. ఇక బెల్టు షాపులకు లెక్కేలేదు. ఆ ఇంటికి దగ్గరలోనే నిర్మల కాలేజీ ప్రిన్సిపాల్ ఇల్లు ఉంది. కట్ చేస్తే దాన్ని కబ్జా చేసి తన అకౌంట్ లో పడేసుకున్నాడు. ఒంటరిగా జీవించే మహిళలను ఆయన టార్గెట్ చేస్తాడు. డబ్బు ఆశ చూపిస్తాడు లొంగకపోతే బలవంతం చేస్తాడు. రాజ్ భవన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న కమలాకర్ వాహనాన్ని చాకచక్యంగా కొట్టేశాడు నరసింహారెడ్డి. ఆ వాహానాన్ని నరసింహారెడ్డి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాధితుడు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. వ్యవహారం బెడిసికొడుతుందని గమనించి, వాహనంతో పరారయ్యాడు.

భర్త చనిపోవడంతో ఓ మహిళ చిన్న టిఫిన్ సెంటర్ ను నిర్వహిస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న నరసింహారెడ్డి ఆమెను లొంగదీసుకోవాలని డబ్బు ఆశచూపాడు. ఆమె లొంగకపోవడంతో దాడికి దిగాడు. వారిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఒక కొడుకుని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది‌. రెండో కొడుకు, భర్తలకు ఆదాయ మార్గాలు లేవు. ఇండ్లల్లో వంటలు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెపై కన్నేసిన నరసింహారెడ్డి ముందుగా ఆమె భర్తకు నైట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పించాడు. మంచివాడిగా పరిచయం అయిన నరసింహారెడ్డి ఇక విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తనకు లొంగకపోతే కొడుకు, భర్తను చంపేస్తానంటూ బెదిరించాడు.

ఉద్యోగం చేస్తున్న డిపార్ట్ మెంట్ లోనూ నరసింహారెడ్డి ఆకృత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయింది. ఆయనపై ఆరోపణలు రాని రోజు లేదు. నరసింహారెడ్డిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళగిరి ఎక్సైజ్ సీఐ చర్యలు చేపట్టారు. డిపార్ట్ మెంట్ యాక్షన్ గా అతనిని సస్పెండ్ చేశారు. డబ్బు ఉందన్న అహంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అక్రమంగా కోట్లు కూడబెట్టి, రౌడీలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. మరీ ఇలాంటి కానిస్టేబుల్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Full View


Tags:    

Similar News