అది మనసులో ఉన్నంత కాలం మార్కులు వెయ్యలేను : ఉండవల్లి

మొదట్లో జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్.. ఈసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టాప్ లెవల్లో అవినీతి కంట్రోల్ అయిందన్న భావన కలుగుతుందని వ్యాఖ్యానించారు.

Update: 2019-10-21 12:24 GMT

మొదట్లో జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్.. ఈసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టాప్ లెవల్లో అవినీతి కంట్రోల్ అయిందన్న భావన కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఓ ప్రముఖ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఉండవల్లి.. ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనకు ప్రస్తుతం ఎన్ని మార్కులు ఇస్తారని జర్నలిస్ట్ అడగగా.. 'నేను మార్కులు వేసేంత నిపుణుడిని కాదు.. ఎందుకో నిజాయితీ ప్రభుత్వం అన్న ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళింది.. ఎవరో ఒకరిద్దరు మంత్రులు లంచం తీసుకుంటే తిరిగి ఇప్పించాడన్న వార్తలు వచ్చాయి.. పైగా నేను మాట్లాడి వారందరు అవినీతి లేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మంచి సంకేతం.. ఇక మార్కులు అంటారా.? జగన్మోహన్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి కొడుకు అది మనసులో ఉన్నంతకాలం నేను ఫెయిర్ గా మార్కులు వెయ్యలేను' అని అన్నారు ఉండవల్లి.

కాగా రాష్ట్ర విభజనపైనా మాట్లాడిన ఉండవల్లి.. అన్యాయంగా ఆరోజు పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాష్ట్రంలోని ఏ పార్టీ నోరు మెదపలేదు.. పైగా ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన విధానం బాగోలేదని ప్రశ్నించిన కాంగ్రెస్ ను.. ఏపీని మీరు ఏ విధంగా విభజించారు అని ప్రధాని మోదీ ఎదురు ప్రశ్నించినప్పుడు కూడా మనవాళ్ళు ఎవరూ మాట్లాడలేదన్నారు. భవిశ్యత్ లో కాంగ్రెస్ పార్టీ అవసరం దేశానికీ ఉందన్న ఉండవల్లి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags:    

Similar News