వైసీపీలోకి జనసేన కీలకనేత..?

వైసీపీలోకి జనసేన కీలకనేత..! వైసీపీలోకి జనసేన కీలకనేత..! వైసీపీలోకి జనసేన కీలకనేత..!

Update: 2019-10-05 05:23 GMT

సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో జనసేన పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆకుల సత్యనారాయణ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజకీయంగా ఇంకా ఎటువంటి నిర్ణయము ప్రకటించకపోయినప్పటికీ అధికార వైసీపీలో చేరుతారన్న ప్రచారం బలంగా వీస్తోంది. ఇప్పటికే ఆకుల.. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆకుల లాంటి సీనియర్లు కావాలన్న భావనలో వైసీపీ ఉంది.

అయితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ టిక్కెట్ పై హామీ ఇస్తే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు ఆకుల చేరికపై రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన చేరితే తన భవిశ్యత్ ఏంటన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఆకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధినేత కన్నా లక్ష్మీనారాయణ.. ఆకులను బీజేపీలో చేరాల్సిందిగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఆకుల మాత్రం ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News