టీడీపీకి షాక్.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ

Update: 2019-10-21 07:26 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, కీలకనేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ, బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన తోపాటు కడప జిల్లాకు చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు.

ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కొద్దీ రోజులకే వైసీపీతో విభేదించిన ఆది. టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. అనంతరం టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సబీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు సోమవారం ఆయన బీజేపీలో చేరారు. 

Tags:    

Similar News