Jammalamadugu: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరగాలి
ఈ నెలలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ట్రైనీ డీయస్పీ శ్రీ పాదరావ్ అన్నారు.
జమ్మలమడుగు: ఈ నెలలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ట్రైనీ డీయస్పీ శ్రీ పాదరావ్ అన్నారు. శుక్రవారం స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నామని అన్నారు.
అలాగే ఎన్నికలలో డబ్బు మద్యం పంపిణీ జరుగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని ,ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యస్సై రంగారావు పాల్గొన్నారు.