కోనవానిపాలెంలో కోడిగుడ్లు పంచిన చేకూరి రామ చంద్రరాజు
కోనవానిపాలెం గ్రామంలో కొరుప్రోలుకి చెందిన చేకూరి రామచంద్రరాజు ( పి.ఏ.ఆర్.రాము) ఆర్దిక సహాయంతో 900 కోడిగుడ్లను శనివారం ఉదయం పంపిణీ చేశారు.
ఎస్.రాయవరం: కోనవానిపాలెం గ్రామంలో కొరుప్రోలుకి చెందిన చేకూరి రామచంద్రరాజు ( పి.ఏ.ఆర్.రాము) ఆర్దిక సహాయంతో 900 కోడిగుడ్లను శనివారం ఉదయం పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని
అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి ప్రజలకు పలురకాలు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నది. కరోనా సోకకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి తగిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నది.
ఆ మేరకు గ్రామస్థులకు గుడ్లను అందించడం జరిగిందని రామచంద్రరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోన సింహాద్రి యాదవ్, ఒమ్మి సూరిబాబు, గొర్ల సూరిబాబు, దారబోయిన లోవరాజు, గొర్ల సత్తిబాబు, ఒమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.