Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ బీభత్సం
Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి నెల్లూరు తీరప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది.
Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి నెల్లూరు తీరప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో.. డ్రైన్లు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైఎస్సార్ నగర్, శ్రామికనగర్, ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పర్యటించారు. బాధితులను ఆయన పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు.. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. తీరప్రాంతంలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేస్తున్నారు.