ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని గుమ్ములూరు, అజ్జమురు, భీమవరం రోడ్డు, సిద్దాపురం రోడ్డులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను నరసాపురం సబ్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ పరిశీలించి అక్కడ ఉన్న రిజిస్టర్డ్ తనిఖీ చేశారు. రిజిస్టర్ లో నోట్ చేయవలసిన వివరాలు గురించి సూచనలు ఇచ్చారు. అదే విధంగా రెడ్ జోన్ లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఆగి, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని రెడ్ జోన్ లో జరుగుతున్న హెల్త్ సర్వే, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం, మండల స్పెషల్ ఆఫీసర్, కమిషనర్, ఎంపిడిఓ ద్వారా మండలం లో శానిటేషన్, ప్రజలకు అందజేస్తున్న కూరగాయలు, పాలు, సరుకులు ఏ విధంగా అందజేస్తున్నారు అని అడిగి, ఇతర ఏమైనా ఇబ్బందులు ఉన్నవేమో అని విచారణ చేసారు. అలాగే ఎసై కు నగరంలో ప్రజలు బయటకు రాకుండా చూడాలని విశ్వనాథన్ సూచించారు.