Visakhapatnam: 9,435 మంది వలస కూలీలకు నిత్యవసరాలు: కలెక్టర్ వి.వినయ్‌చంద్
విశాఖపట్నం: జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలు 9,435 మందికి సరకులు అందజేసినట్లు కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. ఒడిశాకు చెందిన 5,837, బిహార్-1055, ఝార్ఖండ్-1035, పశ్చిమబంగా-736, ఉత్తరప్రదేశ్-328 మంది, ఇతర ప్రాంతాల వారు ఉన్నారన్నారు.
కూలీలకు పది కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 3 కిలోల గోధుమ పిండి, లీటరు నూనె పంపిణీ చేశామన్నారు. మలివిడతలో 500 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల పసుపు, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఇస్తామన్నారు.