ఉపమాక వెంకటేశ్వరుని కళ్యాణం సందర్భంగా స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

ప్రాచీన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక లో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2020-03-06 11:23 GMT

నక్కపల్లి: ప్రాచీన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక లో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టిటిడి అనుబంధ ఆలయము అయిన శ్రీ ఉపమాక వెంకన్న ఆలయంలో ప్రతీయేటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరిగే స్వామి వారి కల్యాణo రోజున వెంకటేశ్వరుని దర్శించి కోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు విచ్చేశారు. మార్చి4వ తేదీన అంకురార్పణ తో మొదలైన ఉత్సవాలు 6వ తేదీన రాత్రి స్వామివారి కళ్యాణo నిర్వహించటకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

స్వామివారికి 7వ తేదీన పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ, 9వ తేదీన చక్ర స్నానం రదోత్సవం,10వ తేదీన ధ్వజరోహరణం వంటి కార్యక్రమాలు స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి సుమారు10గంటలకు స్వామివారి వార్షిక కల్యాణం నిర్వహిస్తారు. ఈ కల్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీనిలో భాగంగానే నేడు ఉదయం నుండి వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.

కల్యాణం కు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. క్యూ లైనులో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విపలమైయ్యారని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి బందరు సరస్సు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. దర్శనంకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.


Tags:    

Similar News