'అందువల్లే బోటుకు లంగర్ తగులుకోవడం లేదు'

'అందువల్లే బోటుకు లంగర్ తగులుకోవడం లేదు'

Update: 2019-10-02 04:01 GMT

గోదావరిలో కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం కూడా ఈ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోటు మునిగిన ప్రాంతంలో మొదటగా వలయాకారంలో నదిలోకి వదిలిన ఐరన్‌ రోప్‌ను మంగళవారం పొక్లెయిన్‌ సాయంతో ఒడ్డుకు లాగుతుండగా రాతి బండలకు చుట్టుకుని తునాతునకైలానట్టు తెలుస్తోంది. దీంతో సుమారు వెయ్యి మీటర్లు రోప్‌ గోదావరిలో ఉండిపోయింది. దాని విలువ రూ.2 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు ధర్మాడీ సత్యం. దీంతో వ్యూహం మార్చి ఏపీ టూరిజం బోటుకు పంటును జత చేసి.. 800 మీటర్ల పొడవైన ఐరన్‌ రోప్‌కు చివరన లంగరు వేసి లాగగా.. అది కూడా విఫలమైంది. గోదావరిలో ఉన్న భారీ రాతిబండల కారణంగా 'అందువల్లే బోటుకు లంగర్ తగులుకోవడం లేదు' ఈ బృందం గ్రహించింది. దీంతో మరో ప్లాన్ సిద్ధం చేసి బోటు వెలికితీత పనులు మూడోరోజు కూడా కొనసాగిస్తున్నారు. 

Tags:    

Similar News